చంద్రబాబు కీలక నిర్ణయం.. కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటూ సూచన

ఈరోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి కార్యకర్తలు, సామాన్య ప్రజలు పుల్ స్టాప్ పెట్టాలి. ఈ రోజు నుంచి నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు.

CM Chandrababu naidu

CM Chandrababu Naidu : ఈరోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి కార్యకర్తలు, సామాన్య ప్రజలు పుల్ స్టాప్ పెట్టాలి. ఈ రోజు నుంచి నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు. నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి ఈరోజు నుంచి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రులకు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు సూచించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో చంద్రబాబు చిట్ చాట్ మాట్లాడారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను దండం పెడతా. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నా. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని చంద్రబాబు సూచించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను చంద్రబాబు స్వీకరించారు.

Also Read : ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే..

అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన, గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైద్య సేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తోందని చంద్రబాబు అభినందించారు. ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని, ధైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధుపండిత్ దాస్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదు. మంచి చేసే వారికి ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు