Chandrababu Naidu: కూటమి ప్రభుత్వం ఓ టీమ్ అని, ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా.. నష్టం వచ్చేలా చేసినా.. చాలా నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
“ఎమ్మెల్యేలు పర్సనల్ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే.. మనం అనుకున్న లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎన్డీఏ సంకల్పం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలి. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు, తెలుగు జాతిని నంబర్-1 రాష్ట్రంగా చేయడానికి అందరూ పని చేయాలి.
Also Read: Mother Dairy Elections: మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎవరెవరు గెలిచారంటే?
వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పని చేస్తాను. పేదల కోసమే అనునిత్యం ఆలోచన చేస్తున్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలను చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోంది” అని తెలిపారు.