ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ.. అందులో ఏముందంటే..

తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు అవసరం.

Cm Chandrababu Naidu : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. ఈ నెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు దాటినా, కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు కోరారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు చెప్పారు.

”సీఎంగా రేవంత్ రెడ్డి అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు అవసరం. దీని కోసం రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ సమస్యలను చాలా శ్రద్ధతో, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో కలుసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ముఖాముఖి సమావేశం ఈ క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన మధ్య జరిగే ఈ చర్చలు ఫలవంతం అవుతాయని రెండు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నా” అని లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవడానికి చొరవ చూపించాలని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్ల దాటినా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. ఈ నెల 6న ముఖాముఖి సమావేశమై సమస్యలు పరిష్కరించుకుందామని రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చారు చంద్రబాబు. అంతేకాదు.. రేవంత్ రెడ్డిని పొగిడారు సీఎం చంద్రబాబు.

ముఖాముఖి సమావేశం క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మన మధ్య జరిగే ఈ చర్చలు ఫలవంతం అవుతాయని, రెండు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నానని లేఖలో ఆకాంక్షించారు చంద్రబాబు. మొత్తంగా ఒక చొరవ అయితే చంద్రబాబు తీసుకున్నారు. ఏపీ సీఎంగా తెలంగాణ సీఎంకు ఆయన కీలక ప్రతిపాదన చేశారు. తెలంగాణ సీఎంని చర్చలకు ఆహ్వానించారు.

Also Read : ఆపరేషన్ ద్వారంపూడి..! మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పవన్ కల్యాణ్..!

ట్రెండింగ్ వార్తలు