CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

Cm Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో పెద్దలను కలిసి వ్యాక్సినేషన్ గురించి చర్చించేందుకు ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కుదరకపోవడంతోనే పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అమిత్ షాతో అపాయింట్మెంట్ కుదిరితే గురువారం తర్వాత ఢిల్లీ వెళ్లనున్నట్లు చెబుతున్నారు. వ్యాక్సినేషన్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు, కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రానికి అందాల్సిన సహాయం గురించి చర్చించనున్నట్లు సమాచారం.