Chandrababu : నేను సీఎం అయ్యాక సంపద సృష్టించా, హైదరాబాద్‌ని మహానగరం చేశా.. జగన్ 10లక్షల కోట్ల అప్పు చేశాడు- చంద్రబాబు

95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆరోజు. అలాంటిది నేను సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టా. Chandrababu Naidu - CM Jagan

Chandrababu Naidu - CM Jagan (Photo : Google)

Chandrababu Naidu – CM Jagan : తాను ముఖ్యమంత్రి అయ్యే సమయంలో రాష్ట్రంలో అప్పుడు నెలకొన్న పరిస్థితులను గుర్తు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 1995లో తాను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేందన్నారు. అలాంటి రోజుల్లో తాను ముఖ్యమంత్రిని అయ్యాక సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టా అని చంద్రబాబు చెప్పారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు.

” నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికి ఇటుక ఇటుక పేర్చుకుంటూ విజన్ 2020 కింద ఈరోజు హైదరాబాద్ మహానగరంగా కావడానికి కృషి చేశా. ఈ సైకో సీఎం 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అన్నింటి ధరలు పెంచేశాడు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆరోజు. అలాంటిది నేను సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టా.

Also Read..Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికి ఇటుక ఇటుక పేర్చుకుంటూ విజన్ 2020 కింద ఈరోజు హైదరాబాద్ మహానగరంగా కావడానికి కృషి చేశా. గుత్తి పట్టణానికి ఓ చరిత్ర ఉంది. గుత్తి కోట ప్రసిద్ధి. శ్రీకృష్ణదేవరాయలు చెరువు నిర్మిస్తే ఈ సీఎం ఆ చెరువుకు నీళ్లు ఇవ్వలేకపోయాడు. అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్క చెరువుకు ప్రతి ఎకరాకు నీరిచ్చి రైతులు బంగారం పండించే స్థాయికి తీసుకొస్తా.

ఒక్క అనంతపురంలోనే 32 సాగునీటి ప్రాజెక్టులు రద్దు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. సీఎం జగన్ 10లక్షల కోట్ల అప్పుడు చేశాడు. ధరలు పెంచేశాడు” అని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!

ఐదేళ్లలో 16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చా..
సోలార్ పవర్ ను రూ.10 నుంచి 2 రూపాయలకు తగ్గించిన ఘనత టీడీపీదే. ఇవాళ అసమర్థ సీఎంతో అంతా నాశనమైంది. భవిష్యత్తులో సోలార్, విండ్ పవర్ అభివృద్ధి చేస్తాం. హంద్రీనీవా కాల్వపై హైడల్ పవర్ కేంద్రాలు నిర్మించి విద్యుత్ కొరత లేకుండా చేస్తాం. టెక్నాలజీని ఉపయోగించి సంపద సృష్టించే ప్రక్రియ చేపడతాం. ప్రతి రైతును ఆదుకునే బాధ్యత నాది. వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గతంలో ఐదేళ్లలో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన పార్టీ టీడీపీ. భవిష్యత్తులో ఐటీని తీసుకొస్తా, వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉపాధి పొందండి. రైతులు కష్టపడాల్సిన పని లేదు. అనంతపురంను హార్టికల్చర్ హబ్ గా మారుస్తా. నీరు, ఇన్ పుట్స్ ఇస్తా. ఏడాదికి రైతుకి రూ.20 వేలు ఇచ్చి ఆదుకుంటాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.