ap cm jagan launch ysr jala kala scheme.. ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీ సీఎం జగన్ సోమవారం(సెప్టెంబర్ 28,2020) ఉదయం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రైతులకు మేలు చేసేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల బోర్లు తవ్విస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉచిత బోర్ల ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందునుంది.
సీఎం జగన్ స్పీచ్‌లో ముఖ్యాంశాలు:
* రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్ఆర్ జలకళ’ పథకం ప్రారంభించిన సీఎం జగన్
* క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పథకం ప్రారంభం
* రైతు కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది, ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నాం.
* 3వేల 648 కిమీ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి తోడు ఉంటానని మాటిచ్చాను.
* నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు ఉండగా, మొత్తం 163 బోరు యంత్రాలు ఇవాళ(సెప్టెంబర్ 28,2020) ప్రారంభిస్తున్నాం.
* దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే సాధ్యం. ఎంతో సంతోషంగా ఉంది.
* నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుడి దయతో ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నాం.
* రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, కేసింగ్ పైపులు కూడా వేస్తాం.
* ఈ పథకంపై వచ్చే నాలుగేళ్లలో రూ.2వేల 340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నా.
* ఇప్పుడు మరో మార్పు చేస్తున్నాము. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడమే కాదు వాటికి మోటార్లు కూడా బిగిస్తాము.
* ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పా. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటరు కూడా ఇవ్వబోతున్నాం.
* ఇందుకు దాదాపు మరో రూ.1600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అయినా వెనకడుగు వేయకుండా అమలు చేస్తున్నాం.
* ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుంది.
* రైతులు ఆన్‌లైన్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. లేదా వలంటీర్ల సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
* హైడ్రో జియాలాజికల్, జియో ఫిజికల్ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు.
* ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
* తొలి ప్రయత్నంలో బోరు విఫలమైతే రెండోసారి కూడా బోరు వేస్తాము.
* ఒక్కోసారి ఎంత సర్వే చేసినా నీరు పడకపోవచ్చు. అందుకే రెండో సారి కూడా బోరు వేయాలని ఆదేశాలు జారీ చేశాం.
* ఇప్పటికే ఉన్న బోరు ఒక వేళ ఫెయిల్ అయితే, అక్కడ కూడా రైతులకు బోరు వేయిస్తాము.
* వారు దరఖాస్తు చేసుకుంటే చాలు.
* నాడు 2004లో నాన్నగారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారు.
* ఇవాళ మరో అడుగు ముందుకు వేస్తూ, రైతులకు ఉచితంగా బోరు బావి తవ్విస్తున్నాము.
* ఒక బోరు రైతుల జీవితాలు ఎలా మారుస్తుంది అన్నది అందరికి అవగాహన ఉండదు. ఈ బోరు ద్వారా రైతుల జీవితాలు మారుతాయి.
* రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటర్లు ఉన్నాయి. వాటి సగటు సామర్థ్యం 7.5 హెచ్‌పీ. అంటే గంటకు 5 యూనిట్లు. రోజుకు 9 గంటల సరఫరా అంటే 45 యూనిట్లు.
* ఇవాళ ఒక్కో యూనిట్ ధర రూ.6.87.
* ఆ విధంగా నెలకు ఒక్కో రైతుకు బోరు ద్వారా రూ.9వేల 274 మేర ప్రయోజనం కలుగుతుంది.
* ఆ పథకానికి మరింత మెరుగుదిద్దుతూ, ఉచితంగా బోర్లు వేయిస్తున్నాము.
* వాటి వల్ల లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. లక్షలాది రైతులకు మేలు జరుగుతుంది. మెట్ట ప్రాంతాల్లో వలసలు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.
* ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.8వేల 655 కోట్లు బకాయిలు ఉన్నాయి.
* ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా బకాయి పెట్టింది. అయినా చిరునవ్వుతో చెల్లించాం.
* రైతులకు పగలే ఉచితంగా విద్యుత్ 9 గంటలు ఇవ్వాలని సంకల్పించాం.
* కానీ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 58 శాతం ఫీడర్లలోనే ఆ సదుపాయం ఉంది. గత ప్రభుత్వం వల్లే ఇలా జరిగింది.
* ఫీడర్ కెపాసిటీ, మౌలిక వసతుల కోసం గత 16 నెలల్లో రూ.1700 కోట్లు ఖర్చు చేశాం.
* ఇవాళ 85 శాతం ఫీడర్ల కెపాసిటీ పెంచాం. రానున్న కొన్ని రోజుల్లో మిగిలిన 15 శాతం ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచుతాం.
* ఉచిత విద్యుత్‌కు మీటర్ల ఏర్పాటుపై రకరకాలుగా విచిత్ర వాదనలు చేస్తున్నారు.
* లోడు తెలుసుకుని మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్తపడడం కోసమే మీటర్లు బిగించాలన్న నిర్ణయం.
* అంతేకాదు దాని వల్ల లోడు ఎంత అన్నది కూడా తెలుస్తుంది.
* ఇంకా ఎంత వోల్జేజీతో విద్యుత్ సరఫరా జరగుతుంది అన్నది కూడా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఫీడర్ల కెపాసిటీ పెంచి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుంది.
* రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఒక హక్కుగా ఇస్తాం. అందుకోసం రైతులు తమ చేతుల మీదుగా ఆ బిల్లులు కడతారు. ఆ మొత్తం రైతుకు నేరుగా ప్రభుత్వం అందిస్తుంది.
* ఎప్పుడైతే రైతు తమ చేతుల మీదుగా బిల్లు కడతాడో, నాణ్యమైన విద్యుత్ కోసం డిమాండ్ చేయవచ్చు. అయితే ఇక్కడ రైతు ఒక్కపైసా ఇవ్వనవసరం లేదు.
* రైతుల ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం.
* దానికి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం కేవలం రూ.2 మాత్రమే.
* దీని వల్ల ప్రభుత్వంపై భారం కూడా పెద్దగా పడదు కాబట్టి, వచ్చే 30 ఏళ్లు క్వాలిటీ పవర్ ఇస్తాం.
* ఎక్కడా రైతులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
* రైతు భరోసాలో ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 సాయం చేస్తున్నాం.
* ఇంకా సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా ప్రీమియమ్ అమలు చేస్తున్నాం.
* ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నాం.
* రైతులకు కనీస గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి. రూ.3200 కోట్లు గతేడాది ఖర్చు చేశాం.
* రైతుల ప్రయోజనం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.
* ఇంకా వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం.
* ఆర్‌బీకేల వద్ద నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తున్నాం.
* రాబోయే రోజుల్లో.. ఈ-క్రాపింగ్ ద్వారా రైతుల పొలం వద్దే పంటల కొనుగోలు జరుగుతుంది.
* రాబోయే ఏడాదిలోనే ఆర్‌బీకేల వద్ద గోదాములు, క్వాలిటీ నిర్ధారణ కోసం అసైన్డ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు.
* రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సదుపాయాల కోసం ఈ-మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటవుతాయి.
* మండల కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు.
* వాటిలో చివరకు చేపలు కూడా అమ్ముతారు. ఇన్ని చేస్తామని సగర్వంగా చెబుతున్నాను.
* ఉచిత విద్యుత్ కోసం డబ్బు వసూలు చేస్తున్నారంటున్న వారిని రైతులు నిలదీయాలి.
* వారు దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి రైతులు నిలదీయాలి.
* నీటి తీరువా 25 శాతం పెంచుతున్నామని ఒక పత్రిక రాసింది. దానికి అసలు మనస్సాక్షి ఉందా?
* అందుకే ప్రతి రైతు వారిని నిలదీయాలి, ప్రశ్నించాలి.
* గత ప్రభుత్వం వదిలి పోయిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు కట్టాం.
* రూ.384 కోట్లు విత్తనాల సేకరణ బకాయిలు వదిలిపెడితే అవీ చెల్లించాం.
* రూ.8వేల 655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు కూడా ఈ ప్రభుత్వం కట్టింది. ఇవన్నీ మీ బిడ్డగా తెలియజేస్తున్నాను.
* ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం, వారికి ఏనాడూ అన్యాయం చేయదు.
* కాబట్టి తప్పుడు ప్రచారం ఎవరు చేసినా అస్సలు నమ్మొద్దు.
* దేవుడి దయ వల్ల రైతులకు ఇంకా మేలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.