CM Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ..

CM Jagan Delhi Tour : దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఏపీ సీఎం జగన్ భేటీ అవుతు బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ భేటీ అయ్యారు.

ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో జగన్ భేటీ అయ్యారు. ఆయన వెంట చీప్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనాల ప్రకారం నిధులు కేటాయింపు, పెండింగ్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. పోలవంర ప్రాజెక్టు పనుల పురోగతిని షెకావత్‌కు జగన్ వివరించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం.. నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం నిధుల విడుదలకు చొరవ చూపాలని జగన్ కోరినట్టు సమాచారం.

అలాగే రాత్రి 7 గంటలకు ధర్మేంద్ర ప్రదాన్, రాత్రి 9 గంటలకు అమిత్ షాను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో జగన్.. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు, పోలవరం ప్రాజెక్టు బిల్లులు, విశాఖ స్టీల్ ప్లాంట్, మూడు రాజధానుల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది.

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ వెంట చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బలశౌరి, వేమూరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భారత్,గురుమూర్తి,మోపిదేవి వెంకటరమణ,ఎం వివి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు