ఏపీ సీఎం జగన్ కు గుడి కట్టి కట్టిస్తున్నారు వైసీపీ నేతలు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంకు చెందిన కొంత మంది నాయకులు జగన్ కు ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో నేతల చేసే పనిని అభినందించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేశారు. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని..ఆ పథకాలు ఎప్పటికీ గుర్తుడిపోవాలనే ఉద్ధేశ్యంతో సీఎం జగన్ కు గుడి కట్టటాలని అనుకున్నామని స్థానిక వైసీపీ నేత కురకూరి నాగేశ్వరరావు చెప్పారు.
పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి దగ్గర ఈ గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ఈ గుడి పూర్తి అయితే జగన్ వద్దకు ఎటువంటి దుష్టశక్తి రాదని వారు అభిప్రాయపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు అండగా ఉంటున్నారని..కరోనా కష్టకాలంలో కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా రాష్ట్రాభివృద్ధి వైపుగా నడుస్తున్నారని తెలిపారు.
రాష్ట్రాభివృద్దికి కష్టపడుతున్న జగన్ కు గుడి కట్టాలని నిర్ణయించామని స్థానిక నేతలు వెల్లడించారు. సాహసోపేత నిర్ణయాలతో ఎంతో మందికి ఆదర్శంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. వై.ఎస్. ఫ్యామిలీ కారణ జన్ములని, ప్రజలకు సేవ చేయాలనే ఆ కుటుంబాన్ని దేవుడు భూమి మీదకు పంపాడని వైసీపీ నేత కురుకూరి నాగేశ్వర్‌రావు తెలిపారు. జగన్ చెంతకు ఏ దుష్ట శక్తులు చేరకూడదనే లక్ష్యంతోనే గుడి నిర్మిస్తున్నట్లు వివరించారు.