CM Jagan : గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో సీఎం జగన్‌, అమ్మవారి దర్శనం

ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం

Cm Jagan

CM Jagan : ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం జగన్. అనంతరం అవధూత దత్త పీఠాధిపతి సచ్చిదానంద స్వామితో సమావేశమయ్యారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సచ్చిదానంద స్వామికి నూతన వస్త్రాలను, పండ్లు ఇచ్చారు. సచ్చిదానంద స్వామి సీఎం జగన్‌కు శాలువ కప్పి ఆశీర్వదించారు. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు.

Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..

ఏపీలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతోషంగా ఉందని సచ్చిదానంద స్వామి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని స్వామీజీ చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎంని కోరినట్టు సచ్చిదానంద స్వామి చెప్పారు. వంశపారంపర్య అర్చకులను కొనసాగించాలని కోరగా, అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్పప్రభావాలు ఇవే..

దత్త పీఠంకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. 35 దేశాల్లో దత్త పీఠం శాఖలను ప్రారంభించి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి హిందూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత్ లో మరో 89 శాఖలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రతినిత్యం పేదలకు అన్నదానం, ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణ చేపడుతున్నారు.