Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు గుండె జబ్బుతో ఎక్కువగా బాధపడే వారు.

Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..

Sugar

Heart Attack : భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్లకు చేరుకుంటారని అంచానా.. అన్ని వయసుల వారికి షుగర్ వ్యాధి రావచ్చు. డయాబెటిస్ ప్రస్తుతం పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు దీని బారిన పడుతూ చికిత్స పొందుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు చెడు ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణం. మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండెపోటు ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ మందులు దీనికి ఒక కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు రెండు రకాల మందులు సాధారణంగా ఉపయోగిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇవి బాగాపనిచేస్తాయి. ఉంటాయి. అదే మందులు గుండెపోటు, గుండె వైఫల్యం ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందట. టైప్ 2 డయాబెటిస్ కోసం సల్ఫోనిలురియాస్ మరియు బేసల్ ఇన్సులిన్ వంటి మందులు వాడేవారిలో ఇది ఆకస్మిక గుండె వైఫల్యం , గుండెపోటుకు దారితీస్తున్నట్లు పరిశోధకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జమా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించబడింది. ఈ ఔషధాలను తీసుకోని వారి కంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 36% ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. టైప్ -2 డయాబెటిస్ ఉన్న 45 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను ఈ అధ్యయనానికి ఎంపిక చేసుకున్నారు. వీరిలో డయాబెటిస్ కోసం సల్ఫోనిలురియాస్ అనే ఔషధాన్ని తీసుకునేవారిలో దాదాపు 36% మందిలో గుండె జబ్బు ప్రమాదం ఉందని కనుగొన్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి.  ఎందుకంటే అధిక రక్తపోటుతో అధిక రక్తంలో చక్కెర ఉన్నప్పుడు, అది ధమనుల గోడలపై ఎక్కువ ఒత్తిడి చేయడం ద్వారా ధమని గోడలను దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. తీవ్ర అలసట, అధికంగా చెమటలు పోయటం, ధీర్షకాలిక చాతి నొప్పి, గుండె కొట్టుకోవటంలో తేడా, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యసహాయం తీసుకోవటం మంచిది.