ఏడాది పాలనపై ఐదురోజులపాటు సీఎం జగన్ వరుస సమీక్షలు

  • Publish Date - May 20, 2020 / 03:15 PM IST

ఏడాది పాలనపై ఏపీ సీఎం జగన్ వరుస సమీక్షలు చేపట్టనున్నారు. ఈనెల 25 నుంచి ఐదురోజులపాటు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. తొలిరోజు వ్యవసాయంపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. నాల్గో రోజు వాలంటీర్ వ్యవస్థ, ఐదో రోజు ప్రణాళిక విభాగంపై సీఎం జగన్ రివ్యూ చేయనున్నారు. 

బుధవారం (మే 30, 2020) నాటికి జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పథకాలు, అదే విధంగా డిపార్ట్ మెంట్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి మేధోమథన సమీక్ష సమావేశాల పేరుతో ఐదు రోజుల పాటు వరుస సమీక్షలు సీఎం జగన్ నిర్వహించనున్నారు. 

ముఖ్యంగా కీలకమైన అంశాలకు సంబంధించి ఐదురోజులపాటు వరుసగా ఈనెల 25 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు సమీక్షలో ఉండబోతున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వ్యవసాయ శాఖపై తొలి రోజు సీఎం జగన్ సమీక్షించబోతున్నారు. రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్యశాఖపై సీఎం మేధమథన సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. చాలా కీలకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాలంటీర్ వ్యవస్థపై నాల్గో రోజు సీఎం సమీక్షించనున్నారు. చివరిగా ప్రణాళిక విభాగంపై కూడా సమీక్షచేయనున్నారు.

ఐదు రోజులు.. ఐదు కీలకమైన అంశాలకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్షలు సీఎం చేయబోతున్నారు. ఆ దిశగా ఆయా డిపార్ట్ మెంట్లకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలంటూ అధికారులు, ఆయా శాఖల మంత్రులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈనెల 30 వ తేదీ నాటికి జగన్..సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వచ్చే ఏడాదికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సబంధించిన క్యాలెండర్ ను నిన్న విడుదల చేశారు. దాని రూపకల్పనతోపాటు సమీక్ష సమావేశాలను కూడా సీఎం జగన్ నిర్వహించనున్నారు.