Raja Singh: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు రాజాసింగ్ రిక్వెస్ట్.. అలాచేస్తే మరోసారి అధికారం మీదే.. 

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఓ రిక్వెస్ట్ చేశారు.

Raja Singh: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు రాజాసింగ్ రిక్వెస్ట్.. అలాచేస్తే మరోసారి అధికారం మీదే.. 

Raja Singh

Updated On : September 10, 2025 / 10:55 AM IST

Raja Singh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రిక్వెస్ట్ చేశారు. మత మార్పిడులను ఆపడానికి మీ శక్తినంతా ఉపయోగించండి, ఆ హిందువులు మిమ్మల్ని మరోసారి అధికారంలోకి తీసుకొస్తారంటూ సూచించారు.

Also Read: CP Radhakrishnan: భారత నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే..

రాజాసింగ్ ఏమన్నారంటే.. ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఒక విజ్ఞప్తి. మైనార్టీలకు మీరు ఎంత సేవ చేసినా మీకు మైనార్టీ ఓట్లు రావు. నేను చెప్పేది రాసుకోండి. మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందున మీకు ముస్లిం ఓట్లు రావు. నేడు భారతదేశంలోని ముస్లింలు బీజేపీని తమ అతిపెద్ద శత్రువులుగా భావిస్తున్నారు. అయోధ్యలో గొప్ప రామాలయం నిర్మించడం, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం మరియు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావడం వంటివి బీజేపీ చేసింది. దీని కారణంగా, నేడు ముస్లింలు బీజేపీకి శత్రువులుగా మారారు.’ అంటూ రాజాసింగ్ పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నేను అభ్యర్థిస్తున్నా.. మైనారిటీల మీద మీరు ఎక్కువ దృష్టిపెట్టకండి. మీ శక్తినంతా హిందువుల మీద ఉపయోగించండి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని హిందూ దేవాలయాలను కాపాడటానికి మీ శక్తినంతా ఉపయోగించండి, మత మార్పిడులను ఆపడానికి మీ శక్తినంతా ఉపయోగించండి, ఆ హిందువులు మిమ్మల్ని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారు అంటూ రాజాసింగ్ అన్నారు.

హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజాసింగ్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, గత నెలలో రాజాసింగ్‌ను బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.