IPS Suspension: నటి జత్వాని కేసు.. ఆ ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగింపు..

ముంబై నటి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో కాంతీరాణా టాటా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గతంలో నిర్ధారణ అయ్యింది.

IPS Suspension: నటి జత్వాని కేసు.. ఆ ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగింపు..

Updated On : September 9, 2025 / 5:20 PM IST

IPS Suspension: సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుపై విధించిన సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1649 జారీ చేశారు సీఎస్ కె విజయానంద్. ముంబై నటి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సీతారామాంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గతంలో నిర్ధారణ అయ్యింది.

ఈ నెల 2న సస్పెన్షన్ రివ్యూ కమిటీ సమావేశమైంది. జత్వాని కేసు లేటెస్ట్ స్టేజ్ ను పరిశీలించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయంతో రివ్యూ కమటీ ఏకీభవించింది. దీంతో ఆయన సస్పెన్షన్ ను 2026 మార్చి 8 వరకు 6 నెలలు పొడిగిస్తూ సిఫారసు చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ కె విజయానంద్.

అటు సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి కాంతీరాణా టాటాపై విధించిన సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1650 జారీ చేశారు సీఎస్ కె విజయానంద్. ముంబై నటి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో కాంతీరాణా టాటా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గతంలో నిర్ధారణ అయ్యింది. ఈ నెల 2న సస్పెన్షన్ సమావేవమైన సస్పెన్షన్ రివ్యూ కమిటీ.. జత్వాని కేసు లేటెస్ట్ స్టేజ్ ను పరిశీలించింది.

Also Read: రాయలసీమపై కూటమి పార్టీల స్పెషల్‌ ఫోకస్.. ఏంటీ స్పెషల్ ప్లాన్?