డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి అందరికీ ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన 104,108 అంబులెన్స్ సేవల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్స్ లను విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంలో బుధవారం సువర్ణాధ్యాయం లిఖించబడింది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను దేవుడి దయతో మాటల్లోకాదు.. చేతల్లో చూపించగలిగామని అన్నారు.
కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను కూడా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఇది ఏపీ చరిత్రలో చెప్పుకోతగ్గ రోజని సీఎం అన్నారు. ఇలాంటి సెంటర్ ప్రభుత్వ వ్యవస్థలో ఉండడం మొదటిసారని.. ఈ సదుపాయం ఆధారంగా మొదటిసారి ప్రభుత్వ కాలేజీల్లో రేడియో థెరఫీకి సంబంధించిన సీట్లనుకూడా తీసుకురాగలిగామని ఆయన చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం. మెడికల్, సర్జికల్, రేడియో విభాగాలన్నీ ఇందులో ఉన్నాయి. హైఎండ్ ఎక్విప్‌మెంట్‌ను తీసుకొచ్చాం. ఏఈఆర్‌బీ అప్రూవల్ ఉన్న మొదటి సెంటర్ కూడా. కర్నూలులో కూడా ఇలాంటి సెంటర్ ఒకటి నిర్మిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
ఈరోజు ప్రారంభించిన అంబులెన్స్ వ్యవస్ధలో మొదటి సారి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకు వస్తున్నామని ఆయన అన్నారు. యూకేలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఇక్కడ అమలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకూ కూడా జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామమని సీఎం జగన్ అన్నారు.
Read:చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం