Sangam Nellore Barrages : నెరవేరిన నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం.. సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్

నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాటిని జాతికి అంకితం చేశారు.

Sangam Nellore Barrages : నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాటిని జాతికి అంకితం చేశారు. సంగం బ్యారేజీ 7.5లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీ కలిగుంది. మూడేళ్లలో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసుకున్నాం అని జగన్ చెప్పారు. గత పాలకులకు బ్యారేజీలు కట్టాలన్న ఆలోచన కూడా రాలేదని జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెల్లూరుకు మంచి చేశారన్న జగన్.. దాన్ని నేను కొనసాగించా అని చెప్పారు.

 

సంగం బ్యారేజీ ప్రారంభం..

టీడీపీ ప్రభుత్వం సంగం బ్యారేజీకి రూ.30 కోట్ల 80లక్షలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. టీడీపీ హయాంలో కమీషన్ల కోసమే పనులు చేసేవారని విమర్శించారు. రూ.200 కోట్లతో సంగం బ్యారేజీని పూర్తి చేశామన్నారు. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టినట్లు జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తున్నాం అని జగన్ చెప్పారు. 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నట్టు జగన్ వెల్లడించారు. సంగం బ్యారేజీతో మొత్తంగా 3లక్షల 85వేల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు జగన్.

 

నెల్లూరు బ్యారేజీ ప్రారంభం..

ట్రెండింగ్ వార్తలు