సీఎం జగన్ వరం : ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామకపత్రాలు

  • Publish Date - July 3, 2020 / 12:50 PM IST

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం జగన్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా..నిధులను కూడా విడుదల చేశారు.

ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలు అసలు ఉండవద్దని..అలాంటి ఓ సంస్థను ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. దానికి అనుగుణంగానే ఔట్ సోర్సింగ్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారు. ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌)కు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. 2020, జులై 03వ తేదీ శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…

భాస్కర్ నాయుడు ఎవరు ?
‘వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాల్లో ఇదొక భాగం. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పాదయాత్ర చేశాను. ఎక్కడ చూసినా తమకు అన్యాయం జరుగుతుందని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతం ఇంత ఇస్తామని చెప్పి ఇంతే ఇస్తున్నారని, కాంట్రాక్టర్ల జీతాలు కత్తిరిస్తున్నారని చెప్పారు. ఉద్యోగం రావడానికీ లంచాలే, జీతాలు తీసుకున్నప్పుడు కూడా లంచాలే..ఈ రెండూ ఇవ్వకపోతే.. ఉద్యోగాలు పీకేస్తామనే వారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో 7 ప్రధాన ఆలయాలకు సంబంధించి కాంట్రాక్ట్‌వాల్యూను విపరీతంగా పెంచారు. అన్నిచోట్లా భాస్కర్‌ నాయుడు పేరు వినిపించేంది. ఎవరీ భాస్కర్‌ నాయడు అంటే చంద్రబాబు నాయుడి బంధువు.

వ్యవస్థలో మార్పులు : – 
కాంట్రాక్టర్లకు మేలు చేసే విధనాలు గతంలో ఉండేవి, సక్రమంగా జీతాలు రావి, మధ్యవర్తులు ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదని వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చాం. కనీసం 50 శాతం ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు రావాలి. అందులో యాభైశాతం అక్కచెల్లెమ్మలకు ఉద్యోగాలు వస్తాయి. మార్పులు కారణంగా రెండు రకాలుగా వ్యవస్థలు ఉంటాయి. కలెక్టర్లు అధ్యక్షతన జిల్లాస్థాయిలో రిక్రూట్‌మెంట్‌ చేస్తారు, ఇన్‌ఛార్జి మంత్రులు రిజర్వేషన్లు పాటించేలా చూస్తారు.

50 శాతం రిజర్వేషన్లు : – 
50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పాటించేలా, 50 శాతం అక్కా చెల్లెమ్మలకు రిజర్వేషన్లు వచ్చేలా ఇన్‌ఛార్జి మంత్రులు చూస్తారు. కలెక్టర్లు తమ జాబితాలను ఆప్కాస్‌కు పంపిస్తారు. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా కచ్చితంగా నెలయ్యేసరికి జీతాలు ఇస్తాం. కమీషన్లు ఉండవు, లంచాలు ఉండవు. నేరుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఖాతాకు ఆప్కాస్‌ పంపిస్తుంది.

50,449 మందికి నియామక పత్రాలు : – 
ESI లాంటి నిబంధనలను పాటిస్తుంది. లంచాలు, వివక్షకు తావులేకుండా… ఎలాంటి కత్తిరింపులు లేకుండా, ఎవ్వరి చేతులు తడపకుండా జీతాలు వారికి ఖాతాల్లోకే వస్తుంది.  50,449 మంది ఇప్పటికే ఆప్కాస్‌ ద్వారా నియామక పత్రాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. ఈ పత్రాలు అందించడం జరుగుతుంది.

మంచి జరుగుతుంది : – 
వివిధ విభాగాలు ఆప్కాస్‌తో అనుసంధానం అయ్యి… మరింతమందికి నియామక పత్రాలు అందుతాయి. పనిచేసే పిల్లలకు మేలు జరగాలని, చేతివాటాలకు ఆస్కారం లేకుండా, పూర్తిజీతాలు వారికందేలా, ఉద్యోగాలకోసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మంచి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఈ బాధ్యతలను కలెక్టర్లు తీసుకోవాలని కోరుతున్నాం’. అని సీఎం జగన్ అన్నారు.

Read:ఏపీ మంత్రివర్గ విస్తరణ..సీఎం జగన్ ఎవరికి శుభవార్త చెబుతారో