CM Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్.. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ కలవనున్నారు.
- Sreehari A
- Published On : June 10, 2021 / 03:09 PM IST
Ap Cm Ys Jagan Mohan Reddy Arrives Delhi To Meet Central Ministers (2)
Ys Jagan Delhi Tour : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ కలవనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు గజేంద్ర సింగ్ షెకావత్, రాత్రి 7 గంటలకు ధర్మేంద్ర ప్రదాన్, రాత్రి 9 గంటలకు అమిత్ షాను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యాటనలో భాగంగా జగన్.. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు, పోలవరం ప్రాజెక్టు బిల్లులు, విశాఖ స్టీల్ ప్లాంట్, మూడు రాజధానుల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల ఢిల్లీలో పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా గడపనున్నారు.
ముందుగా ఢిల్లీలోని సీఎం అధికార నివాసం 1-జన్‌పథ్‌కు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా జగన్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆర్థిక సాయం, పోలవరంతో పాటు పలు రాజకీయాంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నట్టు సమాచారం.
