CM Jagan : విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వండి, సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్

జగన్ పిటిషన్ పై విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. CM Jagan Foreign Tour

CM Jagan Foreign Tour

CM Jagan Foreign Tour : ఏపీ సీఎం జగన్ సెప్టెంబర్ 2న యూకే పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. యూకే పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని పిటిషన్ లో ఆయన కోరారు.

మరోవైపు జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్ పై విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. లండన్ లోని కుమార్తె వద్దకు సెప్టెంబర్ 2న వెళ్లాలని అనుకుంటున్నారు జగన్. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టు ఎలా స్పందింస్తుందని ఆసక్తికరంగా మారింది.

Also Read..Pamarru Constituency: ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి?

అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతులు సడలించాలని తన పిటిషన్ లో కోరారు విజయసాయిరెడ్డి. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ లో పర్యటన కోసం అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సమయం కోరింది సీబీఐ. దాంతో విజయసాయిరెడ్డి పిటిషన్ పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

ట్రెండింగ్ వార్తలు