YSR Vahana Mitra : వైఎస్సార్ వాహనమిత్ర-ఆటో,క్యాబ్ డ్రైవర్లకు మూడో విడత సాయం

వైఎస్ఆర్‌ వాహన మిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది.

Ysr Vahana

YSR Vahana Mitra : ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే… నవరత్నాలు అమలు చేస్తామంటున్న జగన్‌ సర్కార్‌ మరో పథకం అమలు చేస్తోంది. వైఎస్ఆర్‌ వాహన మిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది.

తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసు నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆన్ లైన్ లో ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,48,468 మంది లబ్దిదారులకు 248.64 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందనుంది. వారిలో 2,07,974 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం.

సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ ఉన్న అర్హులైన డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా తదితర ఖర్చుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది 2,24,777 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా.. ఈ ఏడాది కొత్తగా 42 వేల 932 వేల మంది కొత్తగా ఈపధకం ద్వారా లబ్ది పొందనున్నారు.