Ysr Cheyutha Starts Tomorrow
YSR Cheyutha : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు వర్చువల్‌గా రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేయనుంది.
ఈ పథకం ద్వారా రెండేళ్లలో లబ్ధిదారులకు రూ.8,943.52 కోట్ల సాయం అందింది. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కాచెల్లెమ్మలకు ప్రభుత్వం ఏటా రూ.18,500.. నాలుగేళ్లలో రూ.75వేలు సాయం అందించనుంది.
వ్యాపారం చేయాలి అనుకునే వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు ఏర్పాటు చేయిస్తోంది. అమూల్, రిలయన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే 78 వేల మందికి కిరాణా షాపులు పెట్టించి వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా చేసింది.
1,90,517 మందికి గేదెలు, ఆవులు, మేకలు ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు అందిస్తోంది. కిరాణా షాపుల ద్వారా ఒక్కో మహిళ సుమారు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు అదనపు ఆదాయం ఆర్జిస్తోంది.