AP Coronavirus positive cases : ఏపీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 60,804 పాజిటివ్ శాంపిల్స్ పరీక్షించగా.. 10,392 మంది కరోనా పాజిటివ్ నిర్ధారించారు.
కోవిడ్ వల్ల నెల్లూరులో 11 మంది, చిత్తూరులో 10 మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, ప్రకాశంలో 8మంది, కృష్ణలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్‌లో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు మరణించారు.
శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూల్‌లో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,454 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 38,43,550 సాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం 1,03,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,125కి చేరింది.