AP Covid-19 Live Updates: ఏపీలో తగ్గిన కరోనా.. 7,084 మంది రికవరీ

  • Publish Date - October 4, 2020 / 06:28 PM IST

AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 41 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7,084 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.



రాష్ట్రంలో గత 24 గంటల్లో 72,811 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 6,242 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 40 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 60,94,206 శాంపిల్స్ పరీక్షించారు.



ఏపీలో కరోనా కేసులు 7,19,256 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,981 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 54,400 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,58,875 మంది (AP Covid Recovery cases) డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కడపలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.