×
Ad

AP Covid-19 Live Updates : ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. రికవరీ కేసులే ఎక్కువ

  • Published On : September 28, 2020 / 07:58 PM IST

AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీ అయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది.. కరోనా పాజిటివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది.



రాష్ట్రంలో ఏపీలో గత 24 గంటల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 5,487 నమోదు కాగా.. మరో 37 మంది మృతిచెందారు. మొత్తంగా 66,121 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 7,210 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు.



ఇప్పటివరకూ ఏపీలో 56, 66, 323 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు 95వేలు దాటేశాయి. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకూ 5, 745 మంది మృతిచెందారు.



ఏపీలో ప్రకాశం జిల్లాలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కడపలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు మరణించారు.