AP Covid-19 Live Updates : ఏపీలో తగ్గిన కరోనా.. రికవరీ కేసులే ఎక్కువ
- Sreehari A
- Published On : September 30, 2020 / 06:47 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసుల తీవ్రత భారీగా తగ్గిపోతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతు పోతుంటే.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోతోంది.
గడిచిన 24 గంటల్లో 7,075 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,806 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 6,133 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 48 మంది మృతిచెందారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 58,06,558 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో కరోనా కేసులు 6,93,484కు చేరాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,828 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 58,445 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,29,211 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 8 మంది, ప్రకాశంలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు మృతిచెందారు. కృష్ణలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, అనంతపూర్‌లో నలుగురు మరణించారు.
గుంటూరులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, విజయనగరంలో ఒకరు మరణించారు.
