AP Covid-19 Live Updates: ఏపీలో తగ్గని కరోనా కేసులు.. 10వేలకు పైగా పాజిటివ్

  • Publish Date - September 9, 2020 / 07:22 PM IST

ఏపీలో కరోనా కేసులు తగ్డడం లేదు.. ఒక రోజు కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ మరుసటి రోజు నుంచి మళ్లీ 10వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు ఆగడం లేదు.. అందులోనూ పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ టెస్టులు చేస్తుండటంతో కరోనా బారినపడినవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది..



ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో బుధవారం మొత్తం 71,692 శాంపిల్స్ పరీక్షించగా.. వారిలో 10,418 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఏపీలో కరోనాతో మొత్తం 74 మంది మరణించారు. ఏపీలోని జిల్లాల్లో కడపలో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు మరణించారు.



ఇక పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 9,842 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 43,08,762 మంది నుంచి శాంపిల్స్ పరీక్షించారు.