AP Covid Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ పెరిగిపోతున్నాయి.. మునపటిలానే కరోనా పాజిటివ్ కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి.. మంగళవారం ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో 10,601 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించింది.
మరో 73 మంది వరకు కరోనాతో మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా పరీక్షల కోసం 70,993 మందికి శాంపిల్స్ సేకరించగా వారిలో 10,601 మందికి కరోనా సోకినట్టు తేలింది..
ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా బారినపడిన పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ వల్ల గుంటూరులో 10 మంది, అనంతపూర్ లో 8 మంది, చిత్తూరులో 8మంది, కడపలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు మృతిచెందారు.
కృష్ణలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 11,691 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్లారు.. ఇప్పటివరకూ ఏపీ రాష్ట్రంలో 42,37,070 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.