Ap Crop Insurance: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంట బీమా బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. నిధుల విడుదల ఎప్పుడంటే?
2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా(Ap Crop Insurance) పెండింగ్ బకాయిలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.
- V Santhosh Kumar
- Updated on- July 25, 2026 / 05:27 PM IST
Ap crop insurance pending dues cleared union government
- పంటల బీమా విడుదల
- కేంద్రంతో చర్చలు సఫలం
- రైతులకు చేకూరనున్న ఊరట
Ap Crop Insurance: ఆంధ్రప్రదేశ్‌లోని రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన, సానుకూలమైన నిర్ణయం వెలువడింది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలు, నిలిచిపోయిన నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన వేళ ఈ శుభవార్త అందింది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, రైతుల హక్కులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
AP Devotee Tragedy: అరుణాచలంలో తీవ్ర విషాదం.. ‘మోక్ష మార్గం’లో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
ఈ క్రమంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చలు పూర్తిస్థాయిలో ఫలప్రదమైనట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడించారు. 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా(Ap Crop Insurance) పెండింగ్ బకాయిలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు బీమా పరిహారం అందేందుకు మార్గం సుగమమైందని, ఇది అన్నదాతలకు ఎంతో ఊరట కలిగిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
గత పాలకులు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో అనేక సమస్యలు పేరుకుపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయంతో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రైతులకు అందాల్సిన ప్రతి లబ్ధిని సకాలంలో అందించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ, బీమా నిధుల విడుదలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
