AP Devotee Tragedy: అరుణాచలంలో తీవ్ర విషాదం.. ‘మోక్ష మార్గం’లో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ అనే భక్తుడు(AP Devotee Tragedy) శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలుడి దర్శనానికి వెళ్లారు.
AP devotee dies trapped in idukku pillayar cave arunachalam
- అరుణాచలంలో తీవ్ర విషాదం
- గుహలో ఇరుక్కుని మృతి
- ఏపీ భక్తుడిగా గుర్తింపు
AP Devotee Tragedy: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనంతో పాటు మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకంతో గిరిప్రదక్షిణ చేస్తూ మార్గమధ్యంలో ఉన్న పురాతన గుహలను దర్శించుకుంటారు. అయితే, ఈ ఆచారాన్ని పాటించే క్రమంలో ఒక భక్తుడు ప్రమాదవశాత్తు తీవ్ర ఇబ్బందికి గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా, అలాగే ఇతర భక్తుల్లో తీవ్ర తీవ్ర కలకలాన్ని, విషాదాన్ని నింపింది.
Ap SIR Update: ఏపీలో ముగిసిన SIR సర్వే.. 44 లక్షల ఓట్లు ‘అన్ కలెక్టబుల్’.. ఈ నెల 31న ముసాయిదా జాబితా
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు(AP Devotee Tragedy) శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలుడి దర్శనానికి వెళ్లారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ‘ఇడుక్కు పిల్లయ్యార్’ గుహ ఆలయానికి చేరుకున్నారు. తెలుగువారు మోక్ష మార్గంగా భావించే ఈ ఆలయంలో భక్తులు ఒకవైపు ఇరుకైన ద్వారం నుంచి పడుకుని పాకుతూ వెళ్లి మరోవైపు నుంచి బయటకు రావడం ఆనవాయితీ. అయితే శరీరాకృతి కాస్త లావుగా ఉన్న మణికుమార్ ఆ ఇరుకైన గుహ మధ్యలో చిక్కుకుపోవడంతో బయటకు రావడం సాధ్యపడలేదు.
కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి ఆయనను బయటకు తీసినప్పటికీ, లోపల గాలి ఆడక అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
