Cyclone Senyar
AP Cyclone : ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంథా తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించగా.. ప్రస్తుతం సెనియార్ తుఫాన్ ఏపీవైపుకు దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజల పాలిట పీడగా మారనుంది.
దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తరువాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తరువాతి 48గంటల్లో.. అంటే 26వ తేదీ నాటికి తుఫాన్‌గా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన.. మృతులంగా ఆ ప్రాంతం వారే..
ఈ తుపాను ఎక్కడ తీరం దాటుంతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండగా ఏర్పడిన తరువాత తుఫాను ఎటువైపు పయణిస్తుంది.. ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల మొంథా తుపాను ఏపీలో తీరం దాటింది. ఈ కారణంగా వారం రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
ఇప్పటికే మొంథా తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్న పరిస్థితి. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో మరో తుపాను ఏపీ వైపు దూసుకొస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులుసైతం హెచ్చరికలు జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.