Film Industry : సినిమాలో కూడా వారసత్వం – డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

పేదవారు కూడా సినిమా చూడాలి కదా...సినిమా టికెట్ల ధరలపై కమిటీ వేశామన్నారు. సినిమా రంగంలో ఉన్న వారు జీఎస్టీ (GST) సరిగ్గా కట్టడం లేదని...

AP Deputy CM Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా కూడా వారసత్వం అయిపోయిందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిభ ఉన్న వారికి అవకాశం రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 2021, డిసెంబర్ 29వ తేదీ బుధవారం తిరుపతికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

Read More : Radhe Shyam : ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ హైలెట్స్..

సినిమా రంగంలో ఉన్న వారు జీఎస్టీ (GST) సరిగ్గా కట్టడం లేదని, నష్టపోతున్న నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆరోపించారు. ఈ నిర్మాతల కోసం మరో 2, 3 సినిమాలు ఫ్రీగా చేయడం లేదన్నారు. టికెట్ ధర రూ. 2 వేలు, రూ. 3 వేలు అమ్మడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదవారు కూడా సినిమా చూడాలి కదా…సినిమా టికెట్ల ధరలపై కమిటీ వేశామన్నారు. సీఎం జగన్ ఎవరికీ వ్యతిరేకం కాదు…అందరికీ మంచి చేయాలని ఆయనలో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ నాయకులు దిగజారిపోయారని,
చీప్ లిక్కర్ పోసి ఓట్లు అడిగే స్థాయికి ఆ పార్టీ దిగజారిందని విమర్శించారు. పేదవాడి నెత్తుటి ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపకూడదన్నది సీఎం జగన్ లక్ష్యమన్నారు.

Read More : TTD : టీటీడీ కేసు వాదించటానికి తిరుపతి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. టికెట్ల విషయంలో సినిమా రంగంలోని పలువురు నటులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ధరలతో తాము థియేటర్లను తెరవలేమని..నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది యజమానులు థియేటర్లకు లాక్ లు వేశారు. ఈ క్రమంలో..డిస్ట్రిబ్యూటర్లు మంత్రి పేర్ని నానిని కలిసి సమస్యపై చర్చించారు. టికెట్ల ధరలపై ప్రతిపాదనలు ఇచ్చారు. మరి ఈ అంశం ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు