ఏపీ డీజీపీ ఆర్ పీ ఠాకూర్ రెండో రోజు ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లవాసాలతో భేటీ అయ్యారు.
ఏపీ డీజీపీ ఆర్ పీ ఠాకూర్ రెండో రోజు ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లవాసాలతో డీజీపీ భేటీ అయ్యారు. గురువారం గంటన్నరపాటు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా సమావేశం అయ్యారు. ఏపీలో పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, పోలీసు అధికారుల నియామకాలు, వైసీపీ ఫిర్యాదులపై డీజీపీ వివరణ ఇచ్చారు. మరోవైపు ఏపీలోని పరిస్థితులను ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల పోలీసుల బదిలీలు, ప్రభుత్వ జీవోలపై ఏపీ సీఎస్ ను ఈసీ వివరణ కోరింది.
Read Also : విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం
ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేవిధంగా చర్యలు తీసుకుంటుంది. అందుకనుగుణంగా ఏపీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఈసీకి అందిన ఫిర్యాదులను నివృత్తి చేసుకుంటోంది. ఏపీ డీజీపీ, ఇంతకముందున్న ఇంటెలిజెన్స్ డీజీ, పోలీసు అధికారులపై ఇంతకముందు ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అనుకూలంగా మారిందని ఈసీకి ఫిర్యాదులు అందాయి.
Read Also : అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ