Minister Kottu Satyanarayana : ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు -మంత్రి కొట్టు సత్యనారాయణ

వీఐపీల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని మంత్రి చెప్పారు. వేసవిలో ఇబ్బందులు కలగకుండా..

Minister Kottu Satyanarayana : రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వీడియో సమావేశం నిర్వహించారు. వేసవిలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మంత్రి. వీఐపీల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని మంత్రి చెప్పారు.

వేసవిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులతో చెప్పారు. సింహాచలంలో మే 3న జరిగే చందనోత్సవ వేడులకు పట్టిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయాలన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్ట పర్చాలని అధికారులతో చెప్పారు. దేవాలయాల ప్రాంతాల్లో అధిక ధరలకు తినుబండారాలు, వస్తువుల విక్రయాన్నిఅరికట్టాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల వివరాలకు సంబంధించి హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని అధికారులతో చెప్పారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

ట్రెండింగ్ వార్తలు