AP Endowments Department: ఆ వార్తలు నమ్మకండి.. ఫేక్ న్యూస్ ను తీవ్రంగా ఖండించిన ఏపీ దేవాదాయశాఖ

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖపై(AP Endowments Department) వచ్చిన ఆరోపణలను దేవదాయ శాఖ కమిషనర్ తీవ్రంగా ఖండించారు.

AP Endowments Department issues a stern clarification regarding fake news.

  • దేవదాయ శాఖ తీవ్ర ఖండన
  • ఏపీటీఎస్‌కే డిజిటల్ సేవల బాధ్యతలు
  • పారదర్శకంగా ఆలయ నిధుల ఆడిట్

AP Endowments Department: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో డిజిటల్ సేవల కేటాయింపు, నిర్వహణపై ఓ దినపత్రికలో వచ్చిన ఆరోపణలను దేవదాయ శాఖ కమిషనర్ తీవ్రంగా ఖండించారు. “ఆలయాల్లో ‘సాఫ్ట్’గా దోపిడీ!” అనే శీర్షికతో ప్రచురితమైన ఆ వార్తా కథనం పూర్తిగా అవాస్తవమని, ఆధారాలు లేని ప్రచారమని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను, శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఈ అసత్య కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Telangana Rains: తెలంగాణలో మారిపోయిన వాతావరణం.. రానున్న రెండురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

భద్రత కోసమే ఏపీటీఎస్ సేవలు:

ఆలయాల ఆన్‌లైన్ సేవలు, ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు, విరాళాల నిర్వహణ అత్యంత సున్నితమైనవని శాఖ తెలిపింది. ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థల వల్ల డేటా లీకేజీ, సైబర్ దాడుల ప్రమాదం ఉన్నందున ప్రభుత్వ(AP Endowments Department) నోడల్ సంస్థ అయిన ‘ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్’ (APTS)కు బాధ్యతలు అప్పగించామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత డిజిటల్ గవర్నెన్స్ సిస్టమ్‌ను అమలు చేయడానికే ఈ పారదర్శక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలను నమ్మవద్దు:

కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికే సాఫ్ట్‌వేర్ మార్చారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఏపీటీఎస్ సేవలకు కేటాయించే నిధులన్నీ ప్రభుత్వ ఆడిట్ ప్రక్రియకు లోబడే జరుగుతాయని, భక్తుల సొమ్ము దుర్వినియోగం కాదని హామీ ఇచ్చారు. కఠినమైన ఐటీ సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటలైజేషన్ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని కమిషనర్ వెల్లడించారు.