TDP Leader Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండించిన చంద్రబాబు

టీడీపీ నేత నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను కొండాపూర్‌లోని తన నివాసంలోనే మంగళవారం (మే 10)న ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండిస్తూ..

TDP Leader Narayana: టీడీపీ నేత నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను కొండాపూర్‌లోని తన నివాసంలోనే మంగళవారం (మే 10)న ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండిస్తూ.. పూర్తిగా కక్షపూరితమైన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్ చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని ఆరోపించారు.

“పరీక్షల నిర్వహణలో వైఫల్యం కారణంగా అధికార ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు, నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారు”

“ముందస్తు నోటీసు ఇవ్వకుండా, విచారణ కూడా చేయకుండా, ఆధారాలు లేకుండా నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా? నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేస్తున్నార”ని విమర్శలు గుప్పించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.

Read Also : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ కేసుతో పాటు, అమరావతి రాజధాని భూముల CRDA కేసులో కూడా నారాయణ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో విచారణ కోసం నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు