Narendra Modi : ప్రధాని మోదీకి ఏపీ మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు

Narendra Modi : వరుసగా మూడో పర్యాయం.. భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు" అంటూ జగన్ ట్వీట్ చేశారు.

AP Former CM YS Jagan Wishes to Narendra Modi ( Image Source : Google )

Narendra Modi : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వమే కొలువుదీరింది. వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం) మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

“వరుసగా మూడో పర్యాయం.. భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.

మోదీ మాత్రమే కాకుండా ఆయన మంత్రివర్గంలోని పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ చేశారు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఏపీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

Read Also : Bandi Sanjay Kumar : కేంద్ర మంత్రిగా బండి సంజయ్.. కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా..!