AP Tobacco Farmers: పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాలుకు రూ.1,000 అదనపు సాయం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

AP Tobacco Farmers: పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయాలు తీసుకుంది.

AP Government additional assistance of 1,000 per quintal for tobacco farmers

  • పొగాకు రైతులకు అదనపు సాయం
  • తొమ్మిది రోజుల్లో ఖాతాల్లో జమ
  • నీట్ ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు

AP Tobacco Farmers: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అధిక దిగుబడుల వల్ల పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుమతించిన పరిమితి కంటే అదనంగా పంట పండించడం, బోర్డు నిర్లిప్తత వల్ల ఏర్పడిన ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ వ్యాపారులు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రైతులను ఆదుకునే క్రమంలో లోగ్రేడ్, ఆఫ్ స్టైల్ రకాలకు క్వింటాలుకు రూ.1,000 చొప్పున అదనపు సాయం ప్రకటిస్తూ ఉత్తర్వును విడుదల చేసింది.

Also Read – Colombia Earthquake: కొలంబియాలో భారీ భూకంపం.. 111 మంది మృతి

పొగాకు కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు:

ధరల పతనంతో అతలాకుతలమవుతున్న పొగాకు రైతులకు కిలోకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించి, ఆ మొత్తాన్ని కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఫైన్ గ్రేడ్‌ను రూ.230, మీడియం గ్రేడ్‌ను రూ.190, ఆఫ్ స్టైల్‌ను రూ.130, లోగ్రేడ్‌ను రూ.110 చొప్పున ఖచ్చితంగా కొనుగోలు చేయాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన ప్రభుత్వం(AP Tobacco Farmers), గతంలో వ్యాపారులు భారీగా లాభాలు గడించి ఇప్పుడు ధరలు తగ్గించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.