Pensioners DA : పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త, డీఏ పెంపు

రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది. ఈ మేరకు

Pensioners Da

Pensioners DA : రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేశారు. కొత్త పెంపుతో పెన్షనర్ల కరువు భత్యం 33.536 శాతానికి పెరిగింది.

2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిసి ఫించన్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని.. 2022 జనవరి నెల నుంచి చెల్లించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇక 2018 జూలై 1న 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంపుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంచింది. ఈ పెంపు అనంతరం పింఛనుదారుల డీఏ 38.776 శాతానికి పెరిగినట్లైంది.