×
Ad

Amaravati : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ఆర్-5 జోన్ రద్దు.. వైసీపీ హయాంలో ఇచ్చిన ఆ స్థలాలు వెనక్కి..

Amaravati : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఆర్-5 (R5) జోన్ ను రద్దు చేసింది.

CM Chandrababu Naidu

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • అమరావతిలో ఆర్-5 జోన్ రద్దు
  • వైసీపీ హయాంలో కేటాయించిన స్థలాలు మళ్లీ సీఆర్డీయేకు

R5 Zone in Amaravati : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఆర్-5 (R5) జోన్ భూములపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్-5 జోన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ జోన్ కిందకు వచ్చే భూములను వెనక్కి తీసుకునేలా రెవెన్యూ శాఖకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. అదేసమయంలో అక్కడ స్థలాలు కేటాయించిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోనే ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Also Read : AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

గతంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో కృష్ణా, గుంటూరు నగరాలకు చెందిన 50వేల మందికి అమరావతిలో ఆర్-5 జోన్‌లో ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఇందుకోసం సీఆర్డీయేకు చెందిన 900 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. అయితే, ఆ భూములను తీసుకున్నందుకు ఇప్పటికీ సీఆర్డీయేకు రెవెన్యూశాఖ నగదు చెల్లించలేదు. ఇప్పుడు రెవెన్యూశాఖకు తుది నోటీసులు జారీ చేసి ఆ భూములను సీఆర్డీయే వెనక్కు తీసుకోబోతుంది.

సీఆర్డీయే తాజా సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు పలు విషయాలపై కీలక సూచనలు చేశారు. వైసీపీ హయాంలో ఆర్-5 జోన్‌లో ఇండ్ల స్థలాలు కేటాయించడం, ఇందుకోసం సీఆర్డీయే‌కు చెందిన 900 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదలీ చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విఘాతం ఏర్పడుతుందని సీఆర్డీయే అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

వైసీపీ హయాంలో అక్కడ కేటాయించిన భూములను వెనక్కు తీసుకొని, వారి ప్రాంతాల్లోనే ప్రభుత్వ విధానం మేరకు అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం భూసమీకరణ, భూ సేకరణ విధానాల్లో ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. 2023కు ముందుఉన్న విధంగానే ఆర్ -5 జోన్ కొనసాగించాలని నిర్ణయించారు.