Andhra Pradesh : ఏపీలోని సన్న, చిన్నకారు రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.69వేలు.. వెంటనే ఇలా చేయండి..
Andhra Pradesh Fodder cultivation : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పశుగ్రాస కొరతను నివారించడానికి ప్రభుత్వం వీబీ జీ-రామ్‌జీ పథకంను అనుసంధానించనుంది.
- Harish Thanniru
- Published on- October 13, 2026 / 09:32 AM IST
Fodder cultivation
Andhra Pradesh Fodder cultivation : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పశుగ్రాస కొరతను నివారించడానికి ప్రభుత్వం వీబీ జీ-రామ్‌జీ పథకంను అనుసంధానించనుంది. తద్వారా వ్యక్తిగత భూముల్లో పశుగ్రాస సాగుకు రెండేళ్ల కాలపరిమితికిగాను ఎకరానికి రూ.69వేలు వరకు చెల్లించనుంది.
వ్యక్తిగత భూముల్లో పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. అయితే, ఇందుకు అర్హత పొందాలంటే ఖచ్చితంగా వీబీ జీరామ్‌జీ జాబ్ కార్డు కలిగి ఉండాలి. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, చిన్నసన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఎంపికైన వారికి రెండేళ్ల కాలపరిమితికిగానూ ఎకరానికి గరిష్ఠంగా రూ.69,781 అందించనున్నారు.
నిబంధనలు ఇలా..
♦ లబ్ధిదారులు, సాగు భూముల వివరాలను సంబంధిత గ్రామ సభలో ఆమోదించనున్నారు.
♦ పశువుల సంఖ్య ఆధారంగా సాగు చేపట్టే భూమి విస్తీర్ణానికి అనుమతిస్తారు.
♦ రెండు పశువులు అయితే 25 సెంట్లు అదేవిధంగా 3 నుంచి 5 పశువులకు 50 సెంట్లు, ఐదు కంటే ఎక్కువ పశువులు ఉంటే ఒక ఎకరంకు అనుమతిస్తారు.
♦ పశు పోషకులు వారి సొంత భూముల్లో పశుగ్రాస పంటలను సాగు చేయాల్సి ఉంటుంది.
♦ పశుపోషణ వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా మెరుగైన జీవనోపాధిని పొందాలనే ఉద్దేశంతో ఈ పథకంను ప్రభుత్వం అమలు చేయబోతుంది.
