AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఏడాదికి రెండు లక్షలు ఆదా..! ట్యాక్స్ తగ్గింపుతో భారీ మార్పు

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల యాజమానులకు తీపికబురు చెప్పింది.

AP government key decision private travel buses tax reduction

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ట్యాక్స్ తగ్గింపు
  • ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల యాజమానులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులకు ప్రతి సీటుపై విధించే త్రైమాసిక ( మూడు నెలలకు ఒకసారి) పన్నును ఏపీ సర్కార్ తగ్గింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు.

Also Read : El Nino : వచ్చేది కష్టకాలమే..! 2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్.. వర్షాల భవిష్యత్తుపై శాస్త్రవేత్తల హెచ్చరిక

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ట్రావెల్స్ బస్సుల్లో ప్రతీ సీటుపై మూడు నెలలకు ఒకసారి రూ.4వేలు వసూళ్లు చేస్తోంది. అయితే, తాజాగా.. రవాణా శాఖ అధికారులతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంఘాలు సమావేశ మయ్యాయి. ఈ సమావేశంలో రూ. 1500 మేర పన్ను తగ్గించాలని నిర్ణయించారు. ఫలితంగా ప్రతి సీటుపై మూడు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన పన్ను రూ.2500కు చేరింది. గతంలో ఒక్కో బస్సుకు ఏడాదికి సుమారు రూ.6లక్షల వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో దాదాపు రూ.2లక్షల వరకు ఆదా కానుందని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రావెల్స్ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులు తిరిగి ఏపీలో నమోదు చేసుకునే అవకాశాలు పెరిగాయి.

గతంలో ఏపీలో పన్నుల భారం ఎక్కువగా ఉండటంతో ట్రావెల్స్ బస్సుల యాజమానులు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వాహనాలను రిజిస్టర్ చేసుకుని అక్కడే హోమ్ ట్యాక్స్ చెల్లించేవారు. అయితే, ఇటీవలకాలంలో కేంద్రం నుంచి ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకొని దేశవ్యాప్తంగా ట్రావెల్స్ యాజమానులు బస్సులను నడిపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ సర్కార్ పన్నులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 500కుపైగా బస్సులు తిరిగి ఆంధ్రప్రదేశ్ లో రీ -రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చర్యలతో రాష్ట్రానికి ఆదాయం పెరగడంతోపాటు, వాహనాల నియంత్రణ, ఫిట్ నెస్ పర్యవేక్షణ కూడా మెరగుపడుతుంది.