రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ జైలుకు తరలించాలని నిర్ణయించింది. కరోనా నెగెటివ్ ఉన్న ఖైదీలను మాత్రమే సాధారణ జైలుకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్ జైళ్లు కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్నాయి.
ఎందుకంటే కరోనా ఖైదీలు ఆస్పత్రి నుంచి పారిపోతుండటం, వారి నుంచి ఇతరుకు కూడా సోకి కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది అవకాశముంటుందని కాబట్టి ఖైదీల విషయంలో కూడా కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ వ్యక్తులను కోవిడ్ ఆస్పత్రికి తరలించే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లళ్లో టెస్టులు చేసేందుకు మెడికల్ అధికారితోపాటు పారా మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.