ఏపీలో రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది.

New Ration cards

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డులపై సర్వే చేస్తున్న అధికారులు.. అనర్హులను ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు.

 

కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించారు. ఈ సర్వే ఆధారంగా అనర్హులను గుర్తించి వారి కార్డులను తొలగించనున్నట్లు సమాచారం.

కొత్త రేషన్ కార్డుల పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈకేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనుంది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. అనర్హులకు రేషన్ కార్డులు ఉండటంపై ఫోకస్ పెట్టింది. సర్వే ఆధారంగా బోగస్ కార్డులను ఏరివేసేందుకు సిద్ధమైంది. అలాగే అర్హులైన వారికి ఏపీ సర్కార్ రేషన్ కార్డులు జారీ చేస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇదిలాఉంటే.. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా ఏపీలో రేషన్ సరుకులు పంపిణీ జరిగింది. కూటమి ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి చెప్పింది. ప్రతినెల మొదటి పదిహేను రోజులు రేషన్ సరుకులు రేషన్ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఆదివారాలు కూడా రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.