×
Ad

AP Govt : ఏపీలో వారందరికీ శుభవార్త.. రూ.33వేలు ఇక కట్టాల్సిన పనిలేదు.. ప్రభుత్వం ఆదేశాలు జారీ..

AP Govt Stops Lorrys Fitness Fees Hike : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) ఈనెల 11న సరకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులను పెంచుతూ ..

AP Government

AP Govt Stops Lorrys Fitness Fees Hike : ఏపీలోని లారీ యాజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సరుకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (మోర్త్) ఈనెల 11న జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో ఉన్న పాత ఫిట్‌నెస్ ఫీజులనే వసూళ్లు చేయాలని పేర్కొంది.

Also Read : School Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏకంగా ఐదు రోజులు సెలవులు! ఊర్లకు వెళ్లే స్టూడెంట్స్ ఇలా ప్లాన్ చేసుకోండి..

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) ఈనెల 11న సరకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులను పెంచుతూ ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 20ఏళ్లు దాటిన లారీలకు ఫిట్‌నెస్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. ఈ పెంపుతో లారీ యాజమానులు రూ.33వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏపీ లారీ యాజమానుల సంఘం పాత వాహనాల ఫిట్నెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సమ్మెకు దిగింది. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ పెంపు చిన్నతరహా సరుకు యాజమానులపై పెనుభారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

లారీ యాజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు ఇటీవల ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించాలని రవాణాశాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈనెల 11న జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గతంలో ఉన్న పాత ఫిట్నెస్ ఫీజులనే వసూలు చేయాలని పేర్కొంది.

పెంచిన ఫిట్నెస్ ఫీజుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనేది అధ్యయనం చేసి, తగిన సూచనలతో రవాణాశాఖ కమిషనర్ నివేదిక అందజేయాలని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. తాజాగా నిర్ణయం పట్ల ఏపీ లారీ యాజమానుల సంఘం హర్షంవ్యక్తం చేసింది. సీఎంకు, రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు లారీ అసోసియేషన్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.