ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..

పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

AP Government Employees

AP Government Employees : ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. చర్చల్లో పురోగతి లేకపోతే ఎల్లుండి నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ నెల 27న ఛలో విజయవాడకు సిద్ధమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం తదుపరి ఉద్యమ కార్యాచరణ నిర్ణయించనున్నట్లు తెలిపారు.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సెక్రటేరియట్ రెండో బ్లాక్ లో ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించారు. ప్రధానమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు గంటల్లోపే ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. అన్ని సమస్యలపై మరోసారి చర్చిద్దాం, పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యోగ సంఘాలతో సర్కార్ చర్చలకు సానుకూలంగా ఉందని పిలుపు వచ్చిన తర్వాత.. చర్చలు మొదలయ్యాయి.

గతంలో అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిగాయి. అనేక సందర్భాల్లో ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. గతంలో చలో విజయవాడ కార్యక్రమం భారీ విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వం తప్పకుండా దశలవారిగా ఉద్యోగులతో చర్చలు జరిపింది సర్కార్. డీఏ కేటాయింపు, పీఆర్ సీ ఇవ్వడం, డీఏ బకాయిల చెల్లింపు, 20వ పీఆర్సీ వేతన సంఘాన్ని నియమించటం, పాత డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగులు గతంలో తమ ఆందోళనను విరమించారు.

Also Read : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?

అయితే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కార్యచరణ నోచుకోలేదు. 20వ పీఆర్సీ సంఘాన్ని నియమించినప్పటికీ, ఆ కమిషన్ కు కనీసం ఆఫీసు లేదు, సిబ్బంది లేదు, కార్యాచరణ ప్రారంభం కాలేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రెండు డీఏ బకాయిలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా.. నేటి వరకు దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేనటువంటి పరిస్థితి ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు