కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

ఉమ్మడి కృష్ణా రాజకీయం వాడీవేడిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణాలో 16 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు రంగంలో ఉండబోతున్నారు?

కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

Exclusive Report On Krishna District Politics

Krishna District Politics : రాజకీయాలకు రాజధానిగా చెప్పే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు. ఒకటి రెండు చోట్లు తప్పిస్తే మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను వైసీపీ అధికారికంగా ప్రకటిస్తే.. టీడీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఏ నియోజకవర్గానికి ఎవరిని నిలపాలి అనే విషయంపై ఓ అవగాహనకు వచ్చింది టీడీపీ హైకమాండ్. అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు.. కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు.

మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ మిత్రపక్షాలకు రెండు సీట్లు కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగిలిన 14 నియోజకవర్గాలకు అభ్యర్థులపైన క్లారిటీకి వచ్చిన చంద్రబాబు.. ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆయా నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అధికార వైసీపీ.. ఎమ్మెల్యే అభ్యర్థులను సమూలంగా మార్చేసింది.. మంత్రులు, మాజీ మంత్రులకు నియోజకవర్గాలు మార్చితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్థసారథి, రక్షణ నిధి వంటి వారికి టికెట్లు లేవంటూ చెక్ చెప్పింది.

ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీని వీడితే.. ఆయన స్థానంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ కు ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది. ఈ మార్పులు చేర్పులు పరిశీలిస్తే.. ఉమ్మడి కృష్ణా రాజకీయం వాడీవేడిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణాలో 16 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు రంగంలో ఉండబోతున్నారు? దీనిపై 10టీవీ అనాలసిస్..

Also Read : హాట్‌ సీటుగా మారిన విశాఖ పార్లమెంట్‌ స్థానం.. బరిలో ఉండేందుకు పోటీ పడుతున్న నేతలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపుగా ఖరారు అయిన వైసీపీ అభ్యర్థుల జాబితా..!

1.జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను(సిట్టింగ్ ఎమ్మెల్యే) – శ్రీరామ్‌ తాతయ్య, టీడీపీ (మాజీ ఎమ్మెల్యే) – పాత ప్రత్యర్థుల మధ్యే మళ్లీ యుద్ధం..!

2.నందిగామ- మొండితోక జగన్మోహన్ రావు(సిట్టింగ్ ఎమ్మెల్యే) – తంగిరాల సౌమ్య (మాజీ ఎమ్మెల్యే)

3.మైలవరం- సర్నాల తిరుపతిరావు(వైసీపీ) – వసంత కృష్ణప్రసాద్‌(సిట్టింగ్ ఎమ్మెల్యే-టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం) – సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకు టికెట్ నిరాకరించిన వైసీపీ హైకమాండ్.. మైలవరం టికెట్ రేసులో దేవినేని ఉమ (మైలవం టీడీపీ అభ్యర్థి ఎవరు ఉంటారు? దేవినేని ఉమ నియోజకవర్గం మారేందుకు ఒప్పుకుంటారా?)

4.తిరువూరు- నల్లగట్ల స్వామిదాస్(టీడీపీ నుంచి వైసీపీలో చేరిక) – కొలికిపూడి శ్రీనివాసరావు(అమరావతి ఉద్యమ నేత)(టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం)
(సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధిని తప్పించిన వైసీపీ)

5.నూజివీడు- మేక ప్రతాప్ అప్పారావు(సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ) – కొలుసు పార్ధసారథి (పెనమలూరు ఎమ్మెల్యే-టీడీపీలో చేరే అవకాశం)

6.గన్నవరం- వల్లభనేని వంశీ(సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థిగా పోటీ..! – యార్లగడ్డ వెంకటరావు (టీడీపీ) గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసిన

7.గుడివాడ- కొడాలి నాని – వెనిగండ్ల రాము

Also Read : వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది

8. మచిలీపట్నం-పేర్ని కృష్ణమూర్తి – కొల్లు రవీంద్ర

9.అవనిగడ్డ- సింహాద్రి చంద్రశేఖర్ – మండలి బుద్ధప్రసాద్‌

10.పామర్రు- కైలే అనిల్ కుమార్ – వర్ల కుమార్‌రాజా

11.పెనమలూరు- జోగి రమేష్ – దేవినేని ఉమా

12.పెడన- ఉప్పాల రాము – కాగిత కృష్ణప్రసాద్‌

13 విజయవాడ ఈస్ట్- దేవినేని అవినాష్ – గద్దె రామ్మోహన్‌

14. విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస్ – బొండా ఉమామహేశ్వర్‌రావు

15. విజయవాడ వెస్ట్ -ఎస్ కె ఆసిఫ్ – పోతిన మహేశ్‌ (జనసేన)

16. కైకలూరు -దూలం నాగేశ్వరరావు