Site icon 10TV Telugu

Night Curfew: నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Night

Night

Night Curfew: కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో నైట్ కర్ఫ్యూ నేటితో ముగియగా.. దాన్ని పొడిగించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని, వ్యాపారాల దగ్గర మాస్క్‌లు లేనివారికి పెట్టుకోమని చెప్పే బాధ్యత వ్యాపారస్తులదే అని ఆదేశించింది. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రదేశాల్లో కోవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది.

పెళ్లిళ్లు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలకు గరిష్టంగా 200మంది మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించేలా చూడాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది.

కర్ఫ్యూ నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ఆస్పత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది.

Exit mobile version