Thalliki Vandanam: నేడే ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో 15 వేలు
తల్లికి వందనం (Talliki Vandanam Scheme)పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
- V Santhosh Kumar
- Updated on- July 22, 2026 / 10:47 AM IST
AP Government to Release Thalliki Vandanam Scheme Funds
- తల్లికి వందనం నిధుల విడుదల
- ఖాతాల్లో పదిహేను వేల నగదు
- అరవైఏడు లక్షలమందికి మేలు జరుగుతుంది
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు, వారి చదువుల ప్రోత్సాహమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం (Talliki Vandanam Scheme)’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద కుటుంబాలలోని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి వేదికగా నేడు ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం అందనుంది.
ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ నగదు విడుదల కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 67,47,190 మంది విద్యార్థులు లబ్ధి పొందనుండగా, అందుకోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ₹10,091 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించడమే కాకుండా, బడి ఈడు పిల్లలందరూ పాఠశాల బాట పట్టేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
