Andhra Pradesh : జీతాలు ఆలస్యం కాకుండా చూస్తాం, ఈనెలాఖరులోగా పీఆర్సీ

ఉద్యోగుల సంక్షేమం, వారి భధ్రత విషయంలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని, వారి విషయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని...ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కృష్ణారెడ్డి వెల్లడించారు.

AP government Employees : ఉద్యోగుల సంక్షేమం, వారి భధ్రత విషయంలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని, వారి విషయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని…వారి విషయంలో రెండు అడుగులు ముందే సీఎం జగన్ ఉంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కృష్ణారెడ్డి వెల్లడించారు. జీతాలు ఆలస్యం కాకుండా చూస్తామని చెప్పిన ఆయన..ఈనెలాఖరులోగా పీఆర్సీ క్లియర్ చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా…ఆర్థిక పరిస్థితి బాగాలేక..కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనని, ఈ వత్తిడి వల్ల ఉద్యోగుల చిన్న చిన్న సమస్యలు పెద్దయ్యాయని తెలిపారు.

Read More : Bathukamma : సద్దుల బతుకమ్మకు అంతా రెడీ.. ఈ ఏడాది రెండు రోజులు ఎందుకంటే..?

2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై చర్చలు జరిపామని, వీలైనంత వరకూ పీఆర్సీని ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తామన్నారు. 2021, అక్టోబర్ 18, 19వ తేదీల్లో పీఆర్సీపై ఉన్నతాధికారులు మరోసారి చర్చలు జరుపుతారని, వచ్చే రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.

Read More : India Petrol : హైదరాబాద్‌లో లీటర్ రూ. 108, సామాన్యుడిని హడలెత్తిస్తున్న పెట్రోల్

ఉద్యోగ సంఘాల పేరిట రాజకీయాలు చేస్తే వారే పూల్స్ అవుతారన్నారు. 2021, సెప్టెంబర్ నుంచి జీతాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఉద్యోగులని విడగొట్టడం వారితో రాజకీయాలు చేయడం వంటి పద్దతులు ముఖ్యమంత్రి సీఎం జగన్ కు లేవని, సీఎం జగన్ ఆలోచనలు, అమలు చేయాలి ఉంటే…ఉద్యోగుల సహకారం చాలా ముఖ్యమన్నారు. ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి ఒకటిగా ఉండాలన్నారు. గతంలో సంఘాలు విడగొట్టే ఆలోచన తమ ప్రభుత్వంకు ఉండదని, అందరూ కలిసి ఉంటే…సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు