ఎస్సీ, ఎస్టీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన

మోడల్ స్కూల్, కేజీబీవీ వసతి గృహాల్లో 2,138 కేడబ్ల్యూ సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Andhra Pradesh Power Minister Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోలార్ రూఫ్ టాప్‌లపై అసెంబ్లీలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వివరాలు తెలిపారు. అర్హులైన ఎస్సీ,ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తుందని అన్నారు.

“రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5006.35 మెగావాట్లుగా ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ను తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 78.50 గిగావాట్లుకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.

మోడల్ స్కూల్, కేజీబీవీ వసతి గృహాల్లో 2,138 కేడబ్ల్యూ సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేశాం. PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నాం. ఈ పథకం ద్వారా 3,550 కేడబ్ల్యూ ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నాం.

పీఎం సూర్యఘర్ కు బ్యాంకర్ల మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. సూర్యఘర్ కు సహకరించాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్ల సమావేశంలో కోరారు. ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశాం.

Gold Rate: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

త్వరలోనే గ్రామస్థాయిలో పంచాయతీ భవనాలపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ భవనాలపై 130 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం.

ఎస్సీ, ఎస్టీ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్ టాట్‌లను ఏర్పాటు చేస్తుంది. 2014-19 మధ్య కాలంలో 9 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్ట్రం సాధించింది. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేసింది.

పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేసింది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని పెంచకుండా, 9 సార్లు చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసింది” అని తెలిపారు.