మంచి ఫలితాలిస్తున్న డిజిటల్ టీచింగ్ : రొటీన్ కు భిన్నంగా ఉందంటున్న విద్యార్ధులు

  • Publish Date - August 3, 2020 / 01:27 PM IST

కరోనాతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు లేవు. దీంతో పిల్లలకు ఆటవిడుపుగా ఉండి ఆటపాటలతో గడిపేస్తున్నారు. దీంతో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గికుండా ఉండేందుకు పిల్లల దగ్గరకే టీచింగ్ తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.



ముఖ్యంగా ఏపీలో 1 నుంచి 10th వరకు 72 లక్షల మంది విద్యార్థుల్లో 56 శాతానికిపైగా గవర్నమెంట్ చదువుతున్నారు. కరోనా పరిస్థితుల క్రమంలో చదువులు కొనసాగేలా డిజిటల్‌ టీచింగ్ ను దేశంలోని ఏ రాష్ట్రమూ చేపట్టక ముందే దూరదర్శన్‌ (సప్తగిరి చానల్‌), ఆకాశవాణిల ద్వారా విద్యామృతం, విద్యాకలశం పేరుతో నిర్వహించే కార్యక్రమాల ద్వారా రిట రాష్ట్ర ప్రభుత్వం ఈ బోధన చేపట్టింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచనలు పాటిస్తూ హైటెక్, నోటెక్, లోటెక్‌ అని విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరించి హైటెక్‌ వారికి ఆన్‌లైన్‌ పద్ధతిలో, లోటెక్‌ వారికి దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా, నోటెక్‌ వారికి అంటే ఆన్ లైన్ విద్యను అందుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్ధులకు వారి వద్దకే మొబైల్‌వ్యానుల ద్వారా టీచింగ్ ను అందేలా చేస్తున్నారు.



దూరదర్శన్‌ పాఠాలతో విద్యార్థులకు మేలు జరుగుతోందంటున్న నిపుణులు
దూరదర్శన్‌ ద్వారా టీచింగ్ విద్యాశాఖ ప్రసారం చేస్తున్న పాఠాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ పాఠాలు వింటూ విద్యార్థులు తమ వర్క్‌బుక్‌ల ద్వారా కరోనా కాలంలో స్కూల్స్ ఓపెన్ లేకపోయినా..విజ్ఞానాన్ని పొందగలుగుతున్నారు విద్యార్ధులు. టీచింగ్ రొటీన్‌గా కాకుండా ఎంతో ఆసక్తిని కలిగించేవిగా ఉండటంతో విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారని పలువురు అంటున్నారు.